Tuesday, September 26, 2006

శల్యమైన బతుకులు

శ్రమనంతా ధారపోసి
శల్యమైన దైన్య మూర్తి
ఎండిన రొమ్ముల మీదికి
గుక్కపట్టి ఏడ్చి
పాల చుక్క కోసం ఎగబాకిన పిడికెడు ప్రాణానికి
రక్తపు చుక్కలే స్తన్యంగా ఇస్తే
గుక్కెడు పాలివ్వలేని నువ్వు నన్నేందుకు కన్నావని ప్రశ్నిస్తే

పాలివ్వలేని బడుగు జీవనానికి సమాజమే కారణమంటుందా?
లేక
తన పేగే తనని ప్రశ్నిస్తోందని ఆగ్రహిస్తుందా?

1 comment:

spandana said...

చాలా బాగా రాశారు.
ఖచ్చితంగా తన పేగును ప్రశ్నించదు. తన దైన్యానికి జాలిపడుతుంది.
--ప్రసాద్
http://www.charasala.com/blog/