Wednesday, February 28, 2007

భారతీయత

భారతీయుడై పుట్టినందుకు గర్వించకు.
భారతీయత ఆచరించినప్పుడు గర్వించు.

తెలుగువాడిగా పుట్టినందుకు ఆనందించకు
తెలుగుతనాన్ని చాటి చెప్పినప్పుడు ఆనందించు.

వేదాలతో విద్యావంతుణ్ణని విర్రవీగకు
వెలుపలి వారికి విద్యా దానం చేసినపుడు విర్రవీగు.

తాతలు నేతులు తాగారని నినదించకు
చేతలు నీతిగ సాగినపుడు నినదించు.

ఏదీ కానప్పుడు నోరు మూసుకో
ఎగతాళి మాత్రం చేయకు.

Wednesday, February 07, 2007

బ్లాగనా నేను తీయగా...పరుగిడనా బ్లాగు తోటలో నేను హాయిగా

బ్లాగనా నేను తీయగా
పరుగిడనా బ్లాగు తోటలో నేను హాయిగా

మది లోని భాషను లిఖించడానికి లేఖినుండగా
మందికి అందించడానికి అండగా కూడలుండగా
తెలుగు ప్రియుల సమూహం తెలుగుబ్లాగర్స్ ఉండగా
తియ్యటి బ్లాగు మకరందాన్ని ఒక చోట చేర్చే తేనె గూడుండగా

బ్లాగనా నేను తీయగా
పరుగిడనా బ్లాగు తోటలో నేను హాయిగా

బాధగా బ్లాగినా
బేలగా బ్లాగినా
శోధించి బ్లాగినా
రోదించి బ్లాగినా
గాండ్రించి బ్లాగినా
మూగగా బ్లాగినా

ఆత్మీయంగా దీవించే బ్లాగర్లుండగా
బ్లాగనా నేను తీయగా
పరుగిడనా బ్లాగు తోటలో నేను హాయిగా