Wednesday, January 10, 2007

సగం కాలిన శవాన్ని నేను.

నిన్న కోసం మొన్న
నేటి కోసం నిన్న
రేపటి కోసం నేడు
బాధ పడుతూ జాలి పడుతూ
ఆవేశ పడుతూ అసహాయతతో
ఆందోళనతో బ్రతుకుతున్న
బడుగు జీవిని నేను

జీవితాన్ని జీవించలేక
వర్తమానంతో పోరాడ లేక
బ్రతుకు నడుస్తున్న బానిసను నేను
హృదయమే అడవిగా
మనసే ఎడారిలా రెంటికీ చెడ్డ
రేవడిలా భవిష్యత్తు భయంతో
బ్రతికే భ్రష్ట జీవిని నేను

కళ్ళుండీ కనపడనీ, చెవులుండీ వినబడనీ
హృదయముండీ స్పందించని మనసుండీ
మమత పంచని
ఈ జీవారణ్యంలో కలుపు మొక్కని నేను
అడుగు ముందుకెయ్యలేని అభాగ్య జీవిని నేను
మనసు విప్పి ఎవరు మాట్లాడినా
హృదయం తట్టి ఎవరు నిద్ర లేపినా
అర్థ చేసుకోలేని
ఆమోదించలేని
కరుడు కట్టిన కసాయి వాడిని నేను
జీవమున్నది ఒక్క మాంసం లోనే
మిగిలిన నా మనసంతా నిర్జీవమే
అందుకే అంటున్నాను
సగం కాలిన శవాన్ని నేను.
-- సామర్ల రమేష్, వైజాగ్

ఎప్పుడో పదిహేను ఏళ్ళక్రితం చూసిన కవిత ఇది. నచ్చి బ్లాగులో పెడుతున్నా.
--విహారి

3 comments:

Kiranreddy Munnangi said...

very very nice

RAJ & RAJA said...

chana bagundhi............

RAJ & RAJA said...

chana bhagundhi........