Wednesday, February 07, 2007

బ్లాగనా నేను తీయగా...పరుగిడనా బ్లాగు తోటలో నేను హాయిగా

బ్లాగనా నేను తీయగా
పరుగిడనా బ్లాగు తోటలో నేను హాయిగా

మది లోని భాషను లిఖించడానికి లేఖినుండగా
మందికి అందించడానికి అండగా కూడలుండగా
తెలుగు ప్రియుల సమూహం తెలుగుబ్లాగర్స్ ఉండగా
తియ్యటి బ్లాగు మకరందాన్ని ఒక చోట చేర్చే తేనె గూడుండగా

బ్లాగనా నేను తీయగా
పరుగిడనా బ్లాగు తోటలో నేను హాయిగా

బాధగా బ్లాగినా
బేలగా బ్లాగినా
శోధించి బ్లాగినా
రోదించి బ్లాగినా
గాండ్రించి బ్లాగినా
మూగగా బ్లాగినా

ఆత్మీయంగా దీవించే బ్లాగర్లుండగా
బ్లాగనా నేను తీయగా
పరుగిడనా బ్లాగు తోటలో నేను హాయిగా

9 comments:

cbrao said...

బ్లాగే శ్వాసగా ఆనందించండి.

వెంకట రమణ said...

బాగుంది మీ బ్లాగ్పాట!

తెలు'గోడు' unique speck said...

అడ్డూ అదుపూ లేకుండా బ్లాగండి...మమ్మల్ని ఆనందింపజేయండి!

రానారె said...

మీ బ్లాగ్‌'పాట'వమునకు కడుంగడు సంతసమాయెను! :)

వీవెన్ said...

భలే రాసారు.

రాధిక said...

చాలా బాగుందండి.బ్లాగులు,కూడలి వచ్చాకా జోకులు,పేరడీ పాటల స్వరూపాలు మారుతున్నట్టున్నాయి...ఇది బ్లాగు ప్రపంచం విస్తరిస్తుందనడానికి మంచి సంకేతమేమొ?

Nagaraju Pappu said...

చాలా బాగుంది. ఎనానిమస్ కామెంట్లనూహించే కాబోలూ, ఒక కవి - ఉత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి. నాకు నువ్వు రాసావా, నీకు నేను రాసానా అన్నాడు.

ఈ బ్లాగుతోటలో మీ పరుగులు వడివడిగా సాగాలని ఆశిస్తూ..
--నాగరాజు.

Anonymous said...

@ రావ్ గారూ,

బ్లాగే శ్వాస నిజంగానే అవుతోంది.

@ వెంకట రమణ,

నాబ్లాగ్పాటకు ట్యూన్ కడతారామరి.

@సుధీర్ గారూ,

మీరు చెప్పారు గా ఇక బ్లాగుతా తీయగా.

@ రానారె,

సంతసించినందులకు మా జన్మ ధన్యమాయెను ఓ రానారె.

@ వీవెన్ గారూ,

థాంక్స్.

@ రాధిక గారూ,

ఇంకా ఎన్ని మార్పులు తీసుకు వస్తుందో ఈ బ్లాగు ప్రపంచం.

@ నాగ రాజు గారూ,

బ్లాగు తోటలో తిరిగి తిరిగి అలసి సొలసి పడిపోయా. మళ్ళీ లేచిన తరువాత బ్లాగతా.


-- తియ్యగా బ్లాగే విహారి

Anonymous said...

చాలా బాగుంది :)