Friday, January 19, 2007

కామెడీ కవితలు..నవ్వొస్తే నవ్వకండి.

టిఫిన్ మీద....

నాకెందుకీ టిఫిను.
నాకొద్దీ టిఫిను.
నువ్వు చేసిన టిఫిను.
నేను తిననీ టిఫిను.
చేత్తో తిననీ టిఫిను.
స్పూన్ తో తిననీ టిఫిను.

** **

పాల మీద....

తాగాను నేను చిన్నప్పుడు అమ్మ పాలు.
తాగాను నేను చిన్నప్పుడు గేదె పాలు.
తాగాను నేను చిన్నప్పుడు ఆవు పాలు.
దొరక లేదు తరువాత నాకు మేక పాలు.
చివరికి నేను తాగాను డబ్బా పాలు.
ఇప్పుడు నాకొద్దీ గ్లాసెడు పాలు.


** **

పళ్ళ మీద...

గుండ్రంగా వుండేది ఆపిల్ పండు
మెత్తగా వుండేది బత్తాయి పండు
పసుపుగా వుండేది పనస పండు.
పొడవుగా వుండేది అరటి పండు.
పొట్టిగా వుండేది ద్రాక్ష పండు.
గట్టిగా వుండేది జామ పండు
అయినా నాకిష్టమైన పండు చింత పండు.

** **

అమెరికాలో ఉద్యొగం మీద....

నాకెందుకొయీ ఉద్యొగం
నాకేమీ లేదు హృ ద్రోగం
ఒస్తే చెయ్యాలి ప్రతి రోజూ ఊడిగం.
అవుతుంది అది దిన దిన గండం
బజార్ల వెంట బటాణీలు తింటూ
బలాదూరుగా తిరిగే నా పేరు లోనే ఉంది నిరు 'ఉద్యొగం".
(ఫొన్ disconnect అయిపోతుంది)
నీకు లేదురా కవితలు వినే అదృష్టం.
అందుకే నీజీవితమొక దురదృష్టం.
నువ్వు చెయ్యాలి రా అమెరికాలో కాయకష్టం.
నువ్విక్కడ లేనందుకు నీకదో పెద్ద నష్టం.


** **

యాదగిరి మీద...

యాదగిరి!!! నీమీదే అందరి గురి.
నీ మూతిమీదుందో పులిపిరి.
అదే నీ జీవితానికో సిరి.
పొరపాటున నీకు వేసినా ఉరి
పోదురా నీ ఊపిరి.
గోకేస్తె నీ పులిపిరి
పోతుందిర నీ కొన ఊపిరి.

** **

Wednesday, January 10, 2007

అరిగిపోయిన "తిరిగొస్తాం"

ఖండాంతర ప్రయాణం
అమ్మను వదలి అప్తులనొదలి
తిరిగొచ్చి మీకు చేయి అందిస్తా నని
చేత్తో ఓ సారి
కన్నీటి తో ఓ సారి
ఉద్విగ్నంగా ఉబ్బిన కళ్ళతో భారంగా వీడ్కోలు

గతించిన మమతలతో
వికటించిన స్నేహాలతో
శిశిరాన్ని చూస్తూ వేసవిలోకి
వేసవిని చూస్తూ శిశిరంలోకి
గమనించని ఈ కాలంలో

బాల్యాన్ని తలచుకుంటూ
ఎప్పటి కైనా వచ్చేస్తామని
కబురందిస్తూ ఎప్పటికప్పుడు
చక్కని పలుకులు పలుకుతూ

ప్రవాసమా వనవాసమా తెల్చుకోలేని
ప్రవాసునుకి అప్పుడు గుర్తొచ్చింది
బయలు దేరేప్పుడు తీసుకుంది
ఒన్ వే టికెట్టే రిటర్న్ టికెట్ కాదని.

సగం కాలిన శవాన్ని నేను.

నిన్న కోసం మొన్న
నేటి కోసం నిన్న
రేపటి కోసం నేడు
బాధ పడుతూ జాలి పడుతూ
ఆవేశ పడుతూ అసహాయతతో
ఆందోళనతో బ్రతుకుతున్న
బడుగు జీవిని నేను

జీవితాన్ని జీవించలేక
వర్తమానంతో పోరాడ లేక
బ్రతుకు నడుస్తున్న బానిసను నేను
హృదయమే అడవిగా
మనసే ఎడారిలా రెంటికీ చెడ్డ
రేవడిలా భవిష్యత్తు భయంతో
బ్రతికే భ్రష్ట జీవిని నేను

కళ్ళుండీ కనపడనీ, చెవులుండీ వినబడనీ
హృదయముండీ స్పందించని మనసుండీ
మమత పంచని
ఈ జీవారణ్యంలో కలుపు మొక్కని నేను
అడుగు ముందుకెయ్యలేని అభాగ్య జీవిని నేను
మనసు విప్పి ఎవరు మాట్లాడినా
హృదయం తట్టి ఎవరు నిద్ర లేపినా
అర్థ చేసుకోలేని
ఆమోదించలేని
కరుడు కట్టిన కసాయి వాడిని నేను
జీవమున్నది ఒక్క మాంసం లోనే
మిగిలిన నా మనసంతా నిర్జీవమే
అందుకే అంటున్నాను
సగం కాలిన శవాన్ని నేను.
-- సామర్ల రమేష్, వైజాగ్

ఎప్పుడో పదిహేను ఏళ్ళక్రితం చూసిన కవిత ఇది. నచ్చి బ్లాగులో పెడుతున్నా.
--విహారి