:
కోకిలల కుహు కుహు రాగాలు
గజరాజ ఘీంకారాలు
శార్దూల గర్జనలు
స్తబ్దుగా సెలవు తీసుకుంటున్నాయ్
నేను తిరిగిన ఆ నందనవనం
నేడు బోసి పొయింది
గల గల పారే సెలయేళ్ళు
నిశ్చలంగా నిశ్శబ్దంగా పారుతున్నాయి.
విరబూసి వికసించాల్సిన మొగ్గలు
గుబాళింపులు లేకుండానే రాలిపోతున్నాయి
నేను తిరిగిన ఆ నందనవనం
నేడు బోసి పోయింది
ఝుం అనే తుమ్మెదలు
నెమ్మది తిరుగుతున్నాయి
తేనెటీగలు మకరందం లేదని
మదనపడటం మానేశాయి
నేను తిరిగిన ఆ నందనవనం
నేడు బోసి పోయింది
ప్రభాసాన ప్రచండ భానుడు
ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతున్నాడు.
నేను తిరిగిన.... ఆ.... నందనవనం.....
వస్తుందా.... మళ్ళీ...
తెస్తుందా.... మళ్ళీ...
నాడు వెదజల్లిన సౌరభాలు
:
బ్లాగులోకాన్ని కాస్త లోతుగా చూస్తే వచ్చిన స్పందన ఇది.
Tuesday, June 26, 2007
Subscribe to:
Posts (Atom)