Tuesday, June 26, 2007

ఘనీభవించిన చల్లటి ఆనందాలు

:


కోకిలల కుహు కుహు రాగాలు
గజరాజ ఘీంకారాలు
శార్దూల గర్జనలు
స్తబ్దుగా సెలవు తీసుకుంటున్నాయ్
నేను తిరిగిన ఆ నందనవనం
నేడు బోసి పొయింది

గల గల పారే సెలయేళ్ళు
నిశ్చలంగా నిశ్శబ్దంగా పారుతున్నాయి.
విరబూసి వికసించాల్సిన మొగ్గలు
గుబాళింపులు లేకుండానే రాలిపోతున్నాయి
నేను తిరిగిన ఆ నందనవనం
నేడు బోసి పోయింది

ఝుం అనే తుమ్మెదలు
నెమ్మది తిరుగుతున్నాయి
తేనెటీగలు మకరందం లేదని
మదనపడటం మానేశాయి
నేను తిరిగిన ఆ నందనవనం
నేడు బోసి పోయింది

ప్రభాసాన ప్రచండ భానుడు
ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతున్నాడు.
నేను తిరిగిన.... ఆ.... నందనవనం.....
వస్తుందా.... మళ్ళీ...
తెస్తుందా.... మళ్ళీ...
నాడు వెదజల్లిన సౌరభాలు


:
బ్లాగులోకాన్ని కాస్త లోతుగా చూస్తే వచ్చిన స్పందన ఇది.

3 comments:

రానారె said...

ఇంతకీ ఏమిటండీ సంగతి? :)

రాధిక said...

సంగతేమిటో నాకు అర్ధమయింది.నాదీ కొంచెం ఇలాంటి బాధే.బాగా రాసారు.కానీ కొన్ని విరుద్ద భావాలు వాడినట్టనిపించింది.


ఇక నా బాధ:-
ఎక్కడున్నారు వారంతా?
ఏమి చేస్తున్నారు?
నిర్వీర్యం అయిపోయారా? లేక
నిశ్శబ్ధం గానే నన్ను చూస్తున్నారా?

స్వాగత సుమాలు చల్లినవారు
మెచ్చుకోళ్ళ తో ముందుకి నడిపించినవారు
ఏరీ ఆ తొలినాటి స్నేహితులు
ఎక్కడా ఆ అజ్ఞాత హితులు?

GARAM CHAI said...

బాగా చెప్పారు సార్...

తెలుగు వారి కోసం సరికొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడినది
చూసి ఆనందించండి తెలుగు న్యూస్ మూవీ న్యూస్ ... వీక్షించండి ఆశీర్వదించండి

https://www.youtube.com/garamchai