Thursday, September 21, 2006

కళ్ళు మూసుకో

ఎక్కడో దూరం నుండి చూస్తుంటావు
పట్టు తప్పి లొయలొకి జారుతున్న లేడి పిల్లను
చూస్తూ వుండగానే అగాథం లో అంతమైపోతుంది
లేడి పిల్ల ఆక్రందన
నువ్వు సాయం చెయ్య గల్గీ నిస్సహాయుడవే

మరో చోట చూస్తావు
కొండ చిలువ నోట బట్టిన కోడె దూడను
చూస్తూ వుండగానే
అనంత వాయువుల్లో కలిసిపోతుందిలేగ దూడ లేత ప్రాణం.
నువ్వు సాయం చెయ్యలేనినిస్సహాయుడివి.

అదంతా వృక్షారణ్యం
మరి జనారణ్యంలో
నగరం నడిబొడ్డున జనప్రవాహం లో
నువ్వునడుస్తున్న దారి పక్కనే
కరుడు కట్టిన తీవ్రవాద
రాక్షస తుపాకీ దౌష్ట్యానికి
చిల్లులు పడ్డ గుండెలతో
చెదరిని మెదడులతో
నేల కొరుగుతున్నసభ్య సమాజాన్ని చూస్తావు

నువ్వు సాయం చెయ్య గల్గినా
నిస్సహాయుడవే...
సాయం చెయ్యలేక పొయినా
నిస్సహాయుడవే...
అందుకే కళ్ళు మూసుకో.

2 comments:

spandana said...

చాలా బాగున్నాయి మీ కవితలు.

--ప్రసాద్
http://charasala.wordpress.com

మురళీ కృష్ణ said...

దోనపర్తి భూపతి విహారి గారు!

మీ అన్ని కవిథలూ చాలా చాలా బాగున్నాయి. మీకు శుభాభినందనలు.