Friday, September 22, 2006

అనుభూతులు

అనుభూతులెన్నో...
అందులో ఆనందానుభూతులు కొన్నే
అనుభవించగలిగేవీ కొన్నే..
అనుభవించలేనివి లెక్క లేనన్ని

అనుభవించిన ఆనందానుభూతుల్ని
నెమరేసుకుంటూ
అనుభవించలేని వాటి గురించి
ఊహిస్తూ
అనుభవించగలిగిన అనుభూతుల కోసం
అన్యేషిస్తూ....