శ్రమనంతా ధారపోసి
శల్యమైన దైన్య మూర్తి
ఎండిన రొమ్ముల మీదికి
గుక్కపట్టి ఏడ్చి
పాల చుక్క కోసం ఎగబాకిన పిడికెడు ప్రాణానికి
రక్తపు చుక్కలే స్తన్యంగా ఇస్తే
గుక్కెడు పాలివ్వలేని నువ్వు నన్నేందుకు కన్నావని ప్రశ్నిస్తే
పాలివ్వలేని బడుగు జీవనానికి సమాజమే కారణమంటుందా?
లేక
తన పేగే తనని ప్రశ్నిస్తోందని ఆగ్రహిస్తుందా?
Tuesday, September 26, 2006
మరదలుపిల్లా....ప్రేమించిన పిల్లా..
*** కాలేజీ ఊసులు *****
అటు చూస్తే.....
బావా! నీ కోసమే నేను పుట్టాను
నన్ను మనువాడవా అంటుంది
మరదలు పిల్ల
ఇటు చూస్తే
ప్రియా! నీ కోసం నేనెన్నొ కలలు కన్నాను
నన్ను మరిచి పొమ్మంటావ అంటుంది
ప్రేమించిన పిల్ల
బావా! నీ కోసం గుళ్ళూ గోపురాలూ తిరిగాను
నన్ను వీడి వెళ్ళకు అంటుంది
మరదలు పిల్ల
ప్రియా! నువ్వూ నేనూ ఎన్నొ ఊసులు చెప్పుకుంటూ షికార్లు తిరిగాం
నన్ను వీడి వెళ్తావా అంటుంది
ప్రేమించిన పిల్ల
బావా! బామ్మమాటేం చేశావంటుంది
మరదలు పిల్ల
ప్రియా! నాకిచ్చిన మాటేం చేశావంటుంది
ప్రేమించిన పిల్ల
మీరే చెప్పండి నన్నేం చేయమంటారో?
బైరాగిని కమ్మంటారా?
మురారి నవమంటారా?
ప్రేమ పాఠాలు
*** 1990 లో నా మది...కాలేజి రోజులు కదా మరి****
నా మనసు వాకిలి తెరిచి
లోపలికొచ్చి తాళం వేశావ్
ప్రేమ మాస్టార్నని
ప్రణయ పాఠాలు నేర్పావ్
మధురం అదరామృతమని
పెదవీ పెదవీ కలిపావ్
వెన్నెల చూపిస్తానని
ఎద లోయల్లొ దాచుకున్నావ్
బతుకు బాట కు చేయీ చేయీ
కలుపుదామంటే బై..బై అన్నావ్
ఇప్పుడు
నా మనసేమో డై..డై అంటోంది.
ప్రేమ పిచ్చొడిని
**** అప్పుడెప్పుడో కాలేజి రోజుల్లో రాసుకున్నది ****
మనసు పూచిన పూలతో పూజిస్తానంటే
నేనేం దేవతను కానన్నావ్
హృదయ తంత్రులను మీటి రాగాలను పలికిస్తానంటే
నీకేం రాగాలు తెలుసన్నావ్
నీకోసం భావ గీతాల నాలాపిస్తానంటే
నీకేం గాలీబ్ బంధువా అన్నావ్
పదిలంగా దాచుకుంటా నీ రేఖాచిత్రాన్నిమంటే
శిధిలమై పోతుందదెందుకంటావ్
నా రక్తాక్షరాల ఉత్తరాన్నందిస్తే
నీతో నాకేం పోవోయ్ పిచ్చోడా అన్నావ్.
నేనిప్పుడు నిజంగా పిచ్చొడినే....ప్రేమ పిచ్చోడిని.
మనసు పూచిన పూలతో పూజిస్తానంటే
నేనేం దేవతను కానన్నావ్
హృదయ తంత్రులను మీటి రాగాలను పలికిస్తానంటే
నీకేం రాగాలు తెలుసన్నావ్
నీకోసం భావ గీతాల నాలాపిస్తానంటే
నీకేం గాలీబ్ బంధువా అన్నావ్
పదిలంగా దాచుకుంటా నీ రేఖాచిత్రాన్నిమంటే
శిధిలమై పోతుందదెందుకంటావ్
నా రక్తాక్షరాల ఉత్తరాన్నందిస్తే
నీతో నాకేం పోవోయ్ పిచ్చోడా అన్నావ్.
నేనిప్పుడు నిజంగా పిచ్చొడినే....ప్రేమ పిచ్చోడిని.
Friday, September 22, 2006
అనుభూతులు
అనుభూతులెన్నో...
అందులో ఆనందానుభూతులు కొన్నే
అనుభవించగలిగేవీ కొన్నే..
అనుభవించలేనివి లెక్క లేనన్ని
అనుభవించిన ఆనందానుభూతుల్ని
నెమరేసుకుంటూ
అనుభవించలేని వాటి గురించి
ఊహిస్తూ
అనుభవించగలిగిన అనుభూతుల కోసం
అన్యేషిస్తూ....
అందులో ఆనందానుభూతులు కొన్నే
అనుభవించగలిగేవీ కొన్నే..
అనుభవించలేనివి లెక్క లేనన్ని
అనుభవించిన ఆనందానుభూతుల్ని
నెమరేసుకుంటూ
అనుభవించలేని వాటి గురించి
ఊహిస్తూ
అనుభవించగలిగిన అనుభూతుల కోసం
అన్యేషిస్తూ....
Thursday, September 21, 2006
పల్లె వాసులు
మారిపోయిన పల్లె జీవనం... కనుమరుగవుతున్న ఆ ఆత్మీయ జీవితం..
ఎదుగుతున్న దేశంలో.... విదేశీ సంపద ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతుంటే
అందినంత అందుకోవాలనే ఆత్రంతో నగరానికి
పరుగులు పెడుతున్న మన పల్లె వాసులు..
నేను కేరింతలు కొట్టిన ఆ చెరువు గట్ట్లు..
ఇప్పుడు అంబరాన్ని తాకే కాంక్రీటు ప్లాట్లు.
నేను ఎక్కిన ఆ తియ్యటి జామ చెట్టు..నేను కోసిన ఆ అల్ల నేరేడు కొమ్మ
ఇప్పుడు ఆ కాంక్రీటు గోడల మధ్య నీర్జీవంగా వేలాడే ఉయ్యాల దిమ్మ.
సాయం సంధ్యల్లో ఆరుబయట కూర్చున్నప్పుడు
రివ్వున ఎగురుతూ తీతువు పిట్ట చేసే సరాగాలు
ఇప్పుడు పాశ్చ్యాత్య సంస్కృతి తో వెలిసిన
బార్లో మనుషులు చేసే వికారాలు.
యాంత్రిక జీవనంలో తాత్కాలికంగా..తార్కికంగా...తాంత్రికంగా
మాట్లాడే మనుషుల మధ్యకు వెళుతున్న ఓ పల్లె జీవులారా
మీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.
మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు.
మీ జీవితాల్లో ఉగాదులు ఉదయించబోయే రోజుమీముందుకొస్తోంది...కాస్త ఆగండి.
ఎదుగుతున్న దేశంలో.... విదేశీ సంపద ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతుంటే
అందినంత అందుకోవాలనే ఆత్రంతో నగరానికి
పరుగులు పెడుతున్న మన పల్లె వాసులు..
నేను కేరింతలు కొట్టిన ఆ చెరువు గట్ట్లు..
ఇప్పుడు అంబరాన్ని తాకే కాంక్రీటు ప్లాట్లు.
నేను ఎక్కిన ఆ తియ్యటి జామ చెట్టు..నేను కోసిన ఆ అల్ల నేరేడు కొమ్మ
ఇప్పుడు ఆ కాంక్రీటు గోడల మధ్య నీర్జీవంగా వేలాడే ఉయ్యాల దిమ్మ.
సాయం సంధ్యల్లో ఆరుబయట కూర్చున్నప్పుడు
రివ్వున ఎగురుతూ తీతువు పిట్ట చేసే సరాగాలు
ఇప్పుడు పాశ్చ్యాత్య సంస్కృతి తో వెలిసిన
బార్లో మనుషులు చేసే వికారాలు.
యాంత్రిక జీవనంలో తాత్కాలికంగా..తార్కికంగా...తాంత్రికంగా
మాట్లాడే మనుషుల మధ్యకు వెళుతున్న ఓ పల్లె జీవులారా
మీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.
మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు.
మీ జీవితాల్లో ఉగాదులు ఉదయించబోయే రోజుమీముందుకొస్తోంది...కాస్త ఆగండి.
కళ్ళు మూసుకో
ఎక్కడో దూరం నుండి చూస్తుంటావు
పట్టు తప్పి లొయలొకి జారుతున్న లేడి పిల్లను
చూస్తూ వుండగానే అగాథం లో అంతమైపోతుంది
లేడి పిల్ల ఆక్రందన
నువ్వు సాయం చెయ్య గల్గీ నిస్సహాయుడవే
మరో చోట చూస్తావు
కొండ చిలువ నోట బట్టిన కోడె దూడను
చూస్తూ వుండగానే
అనంత వాయువుల్లో కలిసిపోతుందిలేగ దూడ లేత ప్రాణం.
నువ్వు సాయం చెయ్యలేనినిస్సహాయుడివి.
అదంతా వృక్షారణ్యం
మరి జనారణ్యంలో
నగరం నడిబొడ్డున జనప్రవాహం లో
నువ్వునడుస్తున్న దారి పక్కనే
కరుడు కట్టిన తీవ్రవాద
రాక్షస తుపాకీ దౌష్ట్యానికి
చిల్లులు పడ్డ గుండెలతో
చెదరిని మెదడులతో
నేల కొరుగుతున్నసభ్య సమాజాన్ని చూస్తావు
నువ్వు సాయం చెయ్య గల్గినా
నిస్సహాయుడవే...
సాయం చెయ్యలేక పొయినా
నిస్సహాయుడవే...
అందుకే కళ్ళు మూసుకో.
పట్టు తప్పి లొయలొకి జారుతున్న లేడి పిల్లను
చూస్తూ వుండగానే అగాథం లో అంతమైపోతుంది
లేడి పిల్ల ఆక్రందన
నువ్వు సాయం చెయ్య గల్గీ నిస్సహాయుడవే
మరో చోట చూస్తావు
కొండ చిలువ నోట బట్టిన కోడె దూడను
చూస్తూ వుండగానే
అనంత వాయువుల్లో కలిసిపోతుందిలేగ దూడ లేత ప్రాణం.
నువ్వు సాయం చెయ్యలేనినిస్సహాయుడివి.
అదంతా వృక్షారణ్యం
మరి జనారణ్యంలో
నగరం నడిబొడ్డున జనప్రవాహం లో
నువ్వునడుస్తున్న దారి పక్కనే
కరుడు కట్టిన తీవ్రవాద
రాక్షస తుపాకీ దౌష్ట్యానికి
చిల్లులు పడ్డ గుండెలతో
చెదరిని మెదడులతో
నేల కొరుగుతున్నసభ్య సమాజాన్ని చూస్తావు
నువ్వు సాయం చెయ్య గల్గినా
నిస్సహాయుడవే...
సాయం చెయ్యలేక పొయినా
నిస్సహాయుడవే...
అందుకే కళ్ళు మూసుకో.
అమ్మ
జలుబు చేసి జబ్బు చేసి
మంచాన పడ్డప్పుడు జావ చేసి
ఇచ్చిన మాతృమూర్తి పాత్రలో ఒకామె
తన అమ్మపోయిన బాధ లోనున్న
నాన్నను అక్కునచేర్చుకుని ఓదార్చిన
సహధర్మ ఛారిణి పాత్రలో అదే ఆమె.
తన మెళ్ళో వేసిన తాళికి విలువ నిస్తూ నన్నారాధిస్తూ
సహధర్మచారిణి పాత్రలో ఇంకో ఆమె.
అడుగులు తడబడుతూ జారిపడ్డ కొడుకు ను
అనునయిస్తూ ఇంకో మాతృమూర్తి పాత్రలో అదే ఆమె.
ఆమే....అందరికీ స్పూర్తి నిచ్చే
ఓ స్త్రీమూర్తి.. ఓ మాతృమూర్తి...
ఎవరేమన్నా....ఏ తరం మారినా..
నీ స్థానం పదిలం...
నీ విలువలు పదిలం...
నీ గౌరవం పదిలం.
మంచాన పడ్డప్పుడు జావ చేసి
ఇచ్చిన మాతృమూర్తి పాత్రలో ఒకామె
తన అమ్మపోయిన బాధ లోనున్న
నాన్నను అక్కునచేర్చుకుని ఓదార్చిన
సహధర్మ ఛారిణి పాత్రలో అదే ఆమె.
తన మెళ్ళో వేసిన తాళికి విలువ నిస్తూ నన్నారాధిస్తూ
సహధర్మచారిణి పాత్రలో ఇంకో ఆమె.
అడుగులు తడబడుతూ జారిపడ్డ కొడుకు ను
అనునయిస్తూ ఇంకో మాతృమూర్తి పాత్రలో అదే ఆమె.
ఆమే....అందరికీ స్పూర్తి నిచ్చే
ఓ స్త్రీమూర్తి.. ఓ మాతృమూర్తి...
ఎవరేమన్నా....ఏ తరం మారినా..
నీ స్థానం పదిలం...
నీ విలువలు పదిలం...
నీ గౌరవం పదిలం.
గ్రీష్మం నుండి వసంతానికి
తలదించుకుని వెళ్ళే మొహాలు
తలెత్తుకుని మాట్లాడుతున్నాయి
అప్రకటిత ప్రేమలు పెల్లుబుకుతున్నాయి
అత్యంత కృత్రిమంగా
నువ్వు నువ్వు కానప్పుడునీకివి లేవు
నిన్ను నువ్వు నిరూపించుకున్నప్పుడు
నీ కోసం త్యాగాలునీ కోసం పడిగాపులు.
నువ్వు చెయ్యి చాపి దేహీ అన్నప్పుడుచాటేసిన మొహాలు
చెయ్యి చాపి చిరునవ్వులు చిందిస్తున్నాయి
అత్యంత కృత్రిమంగా
నువ్వు గ్రీష్మంలో ఉంటే అంతా ఎండమావులేఅందుకే
వసంతాన్ని శాశ్వతం చేసుకో
తలెత్తుకుని మాట్లాడుతున్నాయి
అప్రకటిత ప్రేమలు పెల్లుబుకుతున్నాయి
అత్యంత కృత్రిమంగా
నువ్వు నువ్వు కానప్పుడునీకివి లేవు
నిన్ను నువ్వు నిరూపించుకున్నప్పుడు
నీ కోసం త్యాగాలునీ కోసం పడిగాపులు.
నువ్వు చెయ్యి చాపి దేహీ అన్నప్పుడుచాటేసిన మొహాలు
చెయ్యి చాపి చిరునవ్వులు చిందిస్తున్నాయి
అత్యంత కృత్రిమంగా
నువ్వు గ్రీష్మంలో ఉంటే అంతా ఎండమావులేఅందుకే
వసంతాన్ని శాశ్వతం చేసుకో
Subscribe to:
Posts (Atom)