Thursday, September 21, 2006

పల్లె వాసులు

మారిపోయిన పల్లె జీవనం... కనుమరుగవుతున్న ఆ ఆత్మీయ జీవితం..
ఎదుగుతున్న దేశంలో.... విదేశీ సంపద ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతుంటే
అందినంత అందుకోవాలనే ఆత్రంతో నగరానికి
పరుగులు పెడుతున్న మన పల్లె వాసులు..

నేను కేరింతలు కొట్టిన ఆ చెరువు గట్ట్లు..
ఇప్పుడు అంబరాన్ని తాకే కాంక్రీటు ప్లాట్లు.
నేను ఎక్కిన ఆ తియ్యటి జామ చెట్టు..నేను కోసిన ఆ అల్ల నేరేడు కొమ్మ
ఇప్పుడు ఆ కాంక్రీటు గోడల మధ్య నీర్జీవంగా వేలాడే ఉయ్యాల దిమ్మ.

సాయం సంధ్యల్లో ఆరుబయట కూర్చున్నప్పుడు
రివ్వున ఎగురుతూ తీతువు పిట్ట చేసే సరాగాలు
ఇప్పుడు పాశ్చ్యాత్య సంస్కృతి తో వెలిసిన
బార్లో మనుషులు చేసే వికారాలు.

యాంత్రిక జీవనంలో తాత్కాలికంగా..తార్కికంగా...తాంత్రికంగా
మాట్లాడే మనుషుల మధ్యకు వెళుతున్న ఓ పల్లె జీవులారా
మీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.
మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు.
మీ జీవితాల్లో ఉగాదులు ఉదయించబోయే రోజుమీముందుకొస్తోంది...కాస్త ఆగండి.

4 comments:

Anonymous said...

అద్భుతంగా ఉన్నాయి :-) నాకు మరో కవినేస్తం దొరికారు. రాయండి.. రాయండి.. రాస్తూనే ఉండండి.

అనిల్ చీమలమఱ్ఱి said...

శ్రీ గారికి,

మీరు తెలుగు బ్లాగు తయారు చేసినదుకు అభినందనలు...
మీ కవితలు బాగున్నాయి.
ఇలానే, ఇంకా చాలా వ్రాయలని, ఆశిస్తున్నాను...

అనిల్ చీమలమఱ్ఱి
aceanil.blogspot.com

..తెలుగు మాట్లాడుదాం, తెలుగు వ్రాద్దాం, తెలుగును బ్రతికిద్దాం..

అభిసారిక said...

chaalaa baagundanDi...

రానారె said...

మనం పల్లెలో ఉండి ఈ మాట చెబితేగానీ ఎవరూ నమ్మరండి