Thursday, September 21, 2006

గ్రీష్మం నుండి వసంతానికి

తలదించుకుని వెళ్ళే మొహాలు
తలెత్తుకుని మాట్లాడుతున్నాయి

అప్రకటిత ప్రేమలు పెల్లుబుకుతున్నాయి
అత్యంత కృత్రిమంగా

నువ్వు నువ్వు కానప్పుడునీకివి లేవు
నిన్ను నువ్వు నిరూపించుకున్నప్పుడు
నీ కోసం త్యాగాలునీ కోసం పడిగాపులు.
నువ్వు చెయ్యి చాపి దేహీ అన్నప్పుడుచాటేసిన మొహాలు
చెయ్యి చాపి చిరునవ్వులు చిందిస్తున్నాయి
అత్యంత కృత్రిమంగా

నువ్వు గ్రీష్మంలో ఉంటే అంతా ఎండమావులేఅందుకే
వసంతాన్ని శాశ్వతం చేసుకో

2 comments:

రానారె said...

ఎప్పుడు సంపదగల్గిన అప్పుడు
బంధువులు వత్తు రది యెట్లన్నన్
తెప్పలుగ చెఱువు నిండిన
కప్పలు పదివేలుఁజేరు గదరా సుమతీ

Unknown said...

Gud proze yarr.r..gud