Thursday, September 21, 2006

అమ్మ

జలుబు చేసి జబ్బు చేసి
మంచాన పడ్డప్పుడు జావ చేసి
ఇచ్చిన మాతృమూర్తి పాత్రలో ఒకామె
తన అమ్మపోయిన బాధ లోనున్న
నాన్నను అక్కునచేర్చుకుని ఓదార్చిన
సహధర్మ ఛారిణి పాత్రలో అదే ఆమె.

తన మెళ్ళో వేసిన తాళికి విలువ నిస్తూ నన్నారాధిస్తూ
సహధర్మచారిణి పాత్రలో ఇంకో ఆమె.
అడుగులు తడబడుతూ జారిపడ్డ కొడుకు ను
అనునయిస్తూ ఇంకో మాతృమూర్తి పాత్రలో అదే ఆమె.

ఆమే....అందరికీ స్పూర్తి నిచ్చే
ఓ స్త్రీమూర్తి.. ఓ మాతృమూర్తి...
ఎవరేమన్నా....ఏ తరం మారినా..
నీ స్థానం పదిలం...
నీ విలువలు పదిలం...
నీ గౌరవం పదిలం.

1 comment:

cbrao said...

అమ్మ గురించి కమ్మగా చెప్పారు. మీ కొత్త బ్లాగుకి స్వాగతం.