Tuesday, September 26, 2006

ప్రేమ పిచ్చొడిని

**** అప్పుడెప్పుడో కాలేజి రోజుల్లో రాసుకున్నది ****

మనసు పూచిన పూలతో పూజిస్తానంటే
నేనేం దేవతను కానన్నావ్
హృదయ తంత్రులను మీటి రాగాలను పలికిస్తానంటే
నీకేం రాగాలు తెలుసన్నావ్
నీకోసం భావ గీతాల నాలాపిస్తానంటే
నీకేం గాలీబ్ బంధువా అన్నావ్
పదిలంగా దాచుకుంటా నీ రేఖాచిత్రాన్నిమంటే
శిధిలమై పోతుందదెందుకంటావ్
నా రక్తాక్షరాల ఉత్తరాన్నందిస్తే
నీతో నాకేం పోవోయ్ పిచ్చోడా అన్నావ్.

నేనిప్పుడు నిజంగా పిచ్చొడినే....ప్రేమ పిచ్చోడిని.

1 comment:

spandana said...

వావ్! చాలా బాగున్నాయి.
నిజంగానే ప్రేమలో పడి రాశారా?
-ప్రసాద్
http://www.charasala.com/blog/